![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 6 ద్వారా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఇనయా ప్రేమలో పడిందన్న విషయం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అర్ధమైపోతుంది. తన లవ్‌ను కన్ఫార్మ్ చేసేసినట్టే అనే విషయం తెలుస్తోంది. తన లవర్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకు ఇనయా మెచ్చిన హీరో ఎవరో తెలుసా..తన జిమ్ ట్రైనర్ ..అతనితో క్లోజ్‌గా ఉన్న ఓ వీడియోను షేర్ చేసింది. దీనికి హార్ట్ సింబల్స్ ని ఆ వీడియోస్ లో పోస్ట్ చేసింది.
అలాగే మంచి హాట్ సాంగ్ ని కూడా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టింది. ఈ వీడియోలో ఇనయాతో పాటు ఉన్న వ్యక్తి పేరు గౌతమ్. అతనొక జిమ్ అండ్ యోగా ట్రైనర్. కొన్ని రోజులుగా ఇనయా గౌతమ్‌తో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. గౌతమ్ తన అన్ని వీడియోస్ లో కూడా తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూనే కనిపించాడు. ఐతే ఇనయా అతనికి అతుక్కుపోయి మరీ కనిపించింది. ఇక వర్షంలో రైన్ కోట్స్ వేసుకుని బండి మీద జాంజాంగా వెళ్తూ డాన్స్ లు చేస్తూ చాలా వీడియోస్ ని పోస్ట్ చేసింది. "మెల్లగా సన్నీలియోన్ ల మారిన ఇనాయ. ఫేమస్ కావడం కోసం ఇలాంటి చీప్ పిక్స్ పెట్టకండి" అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.
![]() |
![]() |